ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. తనదైన సినిమాలు,  నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలోను నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. 


ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ గతంలో నటించిన రభస సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్లుగా సమంత, ప్రణీత నటించారు. బెల్లంకొండ సురేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా.... సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. కాగా, ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయినప్పటికీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమాగా నిలిచింది.

అయితే ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ ను హీరోగా కాకుండా స్టార్ హీరో రామ్ పోతినేనిని హీరోగా పెట్టి ఈ సినిమాను చేయాలని నిర్ణయం తీసుకున్నారట. కానీ రామ్ ఒకప్పుడు తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవాడు. ఆ సమయంలో ఇతర సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంవల్ల రామ్ తో కాకుండా ఎన్టీఆర్ తో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రామ్సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసి మంచి పని చేశాడని ప్రతి ఒక్కరూ అన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. మరోవైపు డ్రాగన్ సినిమాలోని నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: