టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.  సమంత రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.బ్యూటీ స్టార్ హీరోయిన్ ల లిస్టులో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. ఇటీవల సమంత నిర్మాతగా శుభం సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో సమంత మోడ్రన్ డ్రెస్ లో కనిపించింది.

ఆ ఫోటోకి 'ఒక ఆటోగ్రాఫ్, ఒక సెల్ఫీ, ఒకటి చాలా బోరింగ్ గా ఉంది. రెండు అనేది కొత్త ట్రెండ్. #iQOONeo10 ని డ్యూయల్ చీప్ పవర్ తో బొల్డ్, ది స్లీక్ మరియు ది స్టైలిష్ పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే#RenduThaanlniTrendu #AmazonSpecials #2IsTheNewTrend #ad' అనే క్యాప్షన్ ని జత చేసింది. ప్రస్తుతం సమంత మొబైల్ ఫోన్ కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సామ్ తెలుగుతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాల్లో నటించింది. బ్యూటీ అత్తరింటికి దారేది, ఏం మాయ చేసావె, ఓ బేబీ, యశోద, రామయ్య వస్తావయ్యా, అఆ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.  
సమంత హిందీ, మలయాళం భాషల్లో కూడా సినిమాలు చేసింది. సామ్ తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ అందాల భామ ఇప్పటికే నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు , రెండు నంది అవార్డులు సహా అనేక అవార్డులు సొంతం చేసుకుంది. సమంత ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: