నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి పరిచయాలు అక్కర్లేదు. కర్ణాటకకు చెందిన ఈ అందాల సోయగం.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నేమ్ అండ్ ఫేమ్‌ సంపాదించుకుంది. ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. కుర్ర భామలు ఎంత గట్టి పోటీ ఇస్తున్న రష్మిక మాత్రం తన ఫామ్ ను కోల్పోకుండా చేతినిండా చిత్రాలతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. అయితే హీరోయిన్ కాకపోయుంటే రష్మిక ఏమయ్యేది అనే డౌట్ చాలా మందికి ఉంది.


గ‌తంలో ఈ ప్రశ్నకు రష్మిక సమాధానమిచ్చింది. అసలు చిన్నతనంలో నటి అవ్వాలని ఎప్పుడు ఆమె అనుకోలేదట. నిజానికి ఆమె లక్ష్యం కూడా అది కాదు. మైసూర్ కాలేజీలో చదువుతున్న టైంలో టీచర్ వృత్తిపై రష్మికకు ఆసక్తి ఉండేదట. అందులో భాగంగానే సైకాలజీ, ఇంగ్లీష్ సాహిత్యంలో రష్మిక డిగ్రీ పూర్తి చేసింది. అయితే రష్మిక ఒకటి అనుకుంటే విధి ఆమెను మరోవైపు నడిపించింది. సరదాగా మోడలింగ్ లోకి ప్రవేశించిన రష్మికకు `క్లీన్‌ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్‌` పోటీ సినిమా అవకాశాల‌ను తెచ్చిపెట్టింది. ఆమె సునీ ప్రయాణానికి నాంది ప‌లికింది.


క‌న్న‌డ చిత్రం `కిరిక్ పార్టీ`తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభంచి, మొద‌టి ప్ర‌య‌త్నంలోనే హిట్ అందుకున్న ర‌ష్మిక‌.. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. `ఛలో`, `గీత గోవిందం`, `స‌రిలేరు నీకెవ్వరు`, `పుష్ప‌`, `యానిమ‌ల్‌` వంటి చిత్రాలు ర‌ష్మిక‌కు భారీ స్టార్డ‌మ్ ను అందించారు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో ఒక‌రిగా నిల‌బెట్టాయి. అయితే ఒకవేళ నటి కాకపోయుంటే ర‌ష్మిక టీచర్ అయ్యేది. లేదా తండ్రి వ్యాపారాలు చూసుకునే దాన్ని అని రష్మిక గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: