
ప్రేక్షకులు తమ ప్రాంతాల నుంచి లైవ్ షోస్ చూస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ స్టేజీపై వచ్చాడు. ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఎమోషనల్‌గా మారింది. ఈ విజువల్స్ చూస్తూ ప్రతి ఒక్కరి రొమాలు నిక్కబొడుచుకున్నాయి. పవన్ కళ్యాణ్ మునుపు ఎన్నడు, ఇలాంటి పవర్ ఫుల్ ఎంట్రీ ఇప్పటివరకు ఇవ్వలేదని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ సినిమా కోసం ఆయన చేసిన కృషి మరింత ఇంప్రెస్ చేస్తుంది. ఈ సినిమా కోసం ఆయన పాడిన పాటను లైవ్‌లో, స్టేజీపై, ప్రేక్షకుల ముందు పాడడం, ఒక్కసారిగా ఫ్యాన్స్‌ను ఉల్లాసంలో ముంచెత్తింది. ఫ్యాన్స్ అరుపులు, కేకలు, ఉత్సాహంతో ప్రాంగణాన్ని దద్దరిల్లించారు. దీంతో ఓజీ ఈవెంట్‌లో ఫ్యాన్స్ మొత్తం ఆయన ఎంట్రీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఇది నిజంగా మర్చిపోలేని క్షణంగా నిలిచింది అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆ క్లిప్స్ ని వైరల్ చేస్తున్నారు.
ఇక ఈ ఈవ్వంట్ లో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ..సినిమా గురించి ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు. “ఓజీ సినిమాని దర్శకుడు సుజీత్ మామూలుగా తీయలేదు. ఖచ్చితంగా మీక్య్ గూస్ బంప్స్.. మనందరం పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించబోతున్నాడు ఈ సినిమాలో సుజిత్. ఈ సినిమా కోసం రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది . ధిఏటర్స్ లోనే ఈ సినిమా చూడండి.” అంటూ చెప్పుకొచ్చారు.