తమిళ సినిమాల ద్వారా నటిగా కెరియర్ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీలలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈమె తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమెకు తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చిన భారీ విజయం దక్కడానికి మాత్రం చాలా సమయం పట్టింది. కొంత కాలం క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో తెలుగు బాక్సా ఫీస్ దగ్గర ఈమెకు మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ కెరియర్ను ప్రారంభించినప్పటి నుండి ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ స్కిన్ షో కి చాలా దూరంగా ఉంటూ వస్తుంది. దానితో ఈమెను అనేక మంది అభిమానిస్తూ వస్తున్నారు. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా కాలం పాటు స్కిన్ షో చేయకుండా ఎంతో పద్ధతి గల ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో కీర్తి సురేష్ , అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

ఆ తర్వాత వీరు సోషల్ మీడియాలో , సినిమాల్లో కూడా తమ అందాలను భారీగానే ఆరబోస్తున్నారు. ఇక ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతానికి సినిమాల్లో అందాలను పెద్దగా ఆరబోయకపోయినా సోషల్ మీడియాలో తన అందాలను పెద్ద స్థాయి లోనే ఆరబోస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఐశ్వర్య రాజేష్ కూడా సినిమాల్లో అందాలను భారీ ఎత్తున ఆరబోస్తుందా ... లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: