
ప్రధానంగా ఆదిపురుష్, సలార్ సినిమాలకు సంబంధించి ఈ విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే రాజాసాబ్ టీజర్ చూసిన అభిమానులు మాత్రం ప్రభాస్ ఏజ్ పది సంవత్సరాలు తగ్గిందంటూ కామెంట్లు చేస్తున్నారు. వ్యూస్, లైక్స్ విషయంలో సైతం ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. హర్రర్ ఎలిమెంట్స్ ను ఈ సినిమాలో కొత్తగా చూపించారని టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. టీజర్ కట్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
రాజాసాబ్ సినిమా టెక్నీకల్ గా కూడా అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకోవడం ద్వారా ఇతర హీరోలకు అందని స్థాయిలో ఎదుగుతున్నారు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేస్తుండగా డిసెంబర్ నెల ప్రభాస్ కు అచొచ్చిన నెల అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మారుతి ఈ సినిమాతో దర్శకుడిగా ఎన్నో మెట్లు పైకి ఎక్కినట్టేనని చెప్పవచ్చు.
ప్రభాస్ మరో 10 రోజులలో కన్నప్ప సినిమాతో సైతం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభాస్ కోసం ఈ సినిమా చూస్తామంటూ ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే పీపుల్స్ మీడియా బ్యానర్ కు సైతం పూర్వ వైభవం దక్కుతుందని చెప్పవచ్చు.