నయనతార విడాకులు అంటూ గత వారం రోజుల నుండి ప్రచారం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.నయనతార విజ్ఞేష్ శివన్ తో విడాకులు తీసుకోబోతుంది అంటూ గత వారం రోజులుగా కోలీవుడ్ మొత్తం కోడై కూసింది. నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో విడాకులపై పోస్ట్ పెట్టి డిలీట్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ వైరల్ అయింది.ఆ స్క్రీన్ షాట్ లో ఏముందంటే..భర్త మూర్ఖుడు అయితే పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అవుతుంది.అలాగే భర్త ఏదైనా తప్పు చేస్తే దానికి బాధ్యత భార్య వహించాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి అన్నట్లుగా ఆ స్క్రీన్ షాట్ లో ఉంది. కానీ పోస్ట్ పెట్టి వెంటనే నయనతార డిలీట్ చేసినట్టు రూమర్లు వినిపించాయి. 

అంతేకాదు నయనతార పేరుతోనే ఆ పోస్ట్ ఉండడంతో చాలా మంది నెటిజెన్లు షాక్ అయిపోయారు. దీంతో నయనతార విజ్ఞేష్ శివన్ తో విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది.కానీ సడన్గా ఈ విడాకుల న్యూస్ వైరల్ అయిన రెండు రోజులకి నయనతార తన భర్త పిల్లలతో కలిసి ఒక గుడిలో దర్శనమిచ్చింది. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలు రూమర్స్ అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా భర్తతో విడాకుల ప్రచారం జరుగుతున్న వేళ మళ్లీ విగ్నేష్ శివన్ తో విడాకుల గురించి ఒక షాకింగ్ పోస్ట్ పెట్టి అందరి నోళ్లు మూయించింది..
ఇక ఆ పోస్టులో ఏముందంటే.. నయనతార విజ్ఞేష్ శివన్ ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేసి మా గురించి ఇలాంటి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే అంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టింది. దీంతో నయనతార విఘ్నేష్ శివన్ లు విడాకులు తీసుకోబోతున్నారు అని ప్రచారం చేసే వాళ్లందరి నోళ్లు ఒక్క పోస్టుతో నయనతార మూయించేసింది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక నయనతార విగ్నేష్ శివన్ భర్త ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీ చేస్తున్నారు. ఇక నయనతార చిరంజీవి మెగా 157 మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: