సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సార్లు ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడం జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా జరగడం వల్ల ఓ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలోకి ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఏకంగా ఒక స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు .? ఏ హీరోతో సినిమా మిస్ చేసుకుంది .? ఏ హీరో మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది .? ఇలాంటి క్రేజీ వివరాలను తెలుసుకుందాం.

తమిళ సినిమాల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీలలో మాళవిక మోహనన్ ఒకరు. ఈమె సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పేటా మూవీ తో తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కావడంతో ఈమెకు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. 

ఈ మూవీతో ఈమె క్రేజ్ తమిళ్ మరియు తెలుగులో భారీగా పెరిగింది. కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా మాళవిక మోహనన్ హీరోయిన్గా హీరో అనే సినిమాను స్టార్ట్ చేశారు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక ఈ మూవీ ని కొన్ని కారణాల వల్ల ఆపేశారు. దానితో ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతో ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇలా విజయ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సిన ఈ బ్యూటీ ప్రభాస్ మూవీ తో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mm