
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్. నిజానికి ఈ సినిమా హిట్ అవ్వడానికి 50 % కాదు 70% కారణం మ్యూజిక్ కే అంటున్నారు జనాలు . పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దానికి ఒప్పుకుంటున్నారు . థియేటర్లలో పవన్ కళ్యాణ్ కటౌట్ కి దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు కీరవాణి. ఒకవేళ మ్యూజిక్ అటూ ఇటూ అయి ఉన్నా కూడా సినిమా ఇంత పెద్ద హిట్ అయి ఉండేది కాదు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు . మరీ ముఖ్యంగా ఔరంగాజేబు పాత్రలో బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఇచ్చిన మ్యూజిక్ అయితే వినడానికి చాలా చాలా బాగుంది .
అంతే కాదు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ప్రతి ఒక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి చాలా హైలైట్ గా ఇచ్చారు. దీంతో కీరవాణి పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది . ఈ మధ్యకాలంలో కీరవాణిపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే అవ్వంతా తుడిచిపెట్టుకుపోయేలా చేసింది హరిహర వీరమల్లు. కాగా హరిహర వీరమల్లు సినిమాకి కీరవాణి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనేది ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాకి కీరవాణి కేవలం రెండు కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నారట .
మొదటి నుంచి అంతే. కీరవాణీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయరు. ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు . ఈ సినిమాకి కూడా అంతే . కీరవాణి ఏమాత్రం రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదట. మేకర్స్ ఎంత చెప్తే అంతే పుచ్చుకున్నారట. అయితే ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమాకు ఇంత చీప్ రెమ్యూనరేషనా అంటూ కొంతమంది నెగిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు . కీరవాణి మ్యూజిక్ చాలా చాలా బాగుంది అని సినిమా హిట్ అవ్వడానికి మ్యూజిక్ ప్రధాన కారణమని.. మేకర్స్ ఇప్పుడైనా ఇంకొంచెం రెమ్యూనరేషన్ కీరవాణికి ఇస్తే బాగుంటుంది అంటున్నారు పవన్ ఫ్యాన్స్. చూద్దాం మరి మేకర్స్ ఏం చేస్తారో..??