సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత మంది స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటూ ఉంటారు. అలా స్టార్ హీరోయిన్ కి స్థాయికి చేరుకున్న వారు అలా కొన్ని సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించి వారి క్రేజ్ కాస్త తగ్గుతుంది అనుకునే సమయంలో అందులో చాలా మంది కమర్షియల్ సినిమాలలో నటిస్తూ తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కంటే కూడా వైవిధ్యమైన సినిమాలలో , అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అత్యంత ప్రథమ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లు ఈ రూట్ లోకి వచ్చారు. ప్రస్తుతం అందులో కొంత మంది ఆ జోనర్ మూవీలతో  కెరీర్ను చాలా బిజీగా ముందుకు సాగిస్తున్నారు. 

మరి అలా కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో అనుష్క , కాజల్ , సమంత ముందు వరుసలో ఉన్నారు. అనుష్క చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇప్పుడు మాత్రం ఈమె కమర్షియల్ సినిమాల్లో నటించడం కంటే కూడా వైవిధ్యమైన సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తుంది. అలాగే కాజల్ , సమంత కూడా ఈరోట్లోనే పయనిస్తున్నారు. వీరిద్దరు కూడా చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ కొనసాగించారు. ఈ మధ్య కాలంలో మాత్రం  వీళ్లు కమర్షియల్ సినిమాల్లో నటించ డం కంటే కూడా ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాల్లో , లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇకపోతే ఈ ముగ్గురిలో అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటి అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాజల్ , సమంత మాత్రం ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: