
అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్లు అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ చెంజర్ సినిమాకు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిందో ఈ సినిమా విషయంలో సైతం అదే విధంగా జరిగిందని చెప్పవచ్చు. అయితే పవన్ చేసిన కామెంట్లపై కూటమి అనుకూల పత్రికలో సైతం వ్యతిరేక కథనాలు వచ్చాయి.
పవన్ ను కూటమి అనుకూల పత్రికలూ సైతం నెగిటివ్ చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోంది. పవన్ కళ్యాణ్ అంటే ఇంత వ్యతిరేకతకు కారణమేంటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పారితోషికం 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో నిరాశ పరిచినా ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉన్నా ఆ ట్విస్టులు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అయితే మెప్పించలేదని కచ్చితంగా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాల్లో హీరోగా కెరీర్ ను కొనసాగిస్తారో లేదో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు