పవన్ కళ్యాణ్ హీరోగా..నిధి అగర్వాల్ హీరోయిన్ గా.. వచ్చినటువంటి తాజా పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు.. జూలై 24న భారీ అంచనాలతో రిలీజ్ అయింది..ఈ సినిమా మొదటి రోజే అద్భుతమైన కలెక్షన్స్ సాధించి సక్సెస్ దిశగా అడుగులు వేసింది. అంతేకాదు మొదటి రోజు దాదాపు 70 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు వార్తలు వినిపించాయి. అలాంటి హరిహర వీరమల్లు చిత్రాన్ని ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా కోసం  గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూశారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టుగానే సినిమా కూడా  మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు సినిమా సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించారు. 

అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. దీంతో సీరియస్ అయినటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి PS లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరి హర వీరమల్లు సినిమా  సక్సెస్ మీట్ లో దాడులు చేయాలని అభిమానులను రెచ్చగొట్టడం పవన్ కళ్యాణ్ కే చెల్లుతుందన్నారు.. రాష్ట్రంలో ఒక మంచి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలా ప్రజలను రెచ్చగొట్టడం,శాంతి భద్రతలకు విగాథం కలిగించేలా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. పవన్ కళ్యాణ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పిఎస్ లో కంప్లైంట్ ద్వారా పేర్కొన్నారు.

 ఇదే సమయంలో హరిహర వీరమల్లు సినిమా  ఎప్పుడైతే రిలీజ్ అవుతుందని ప్రకటించారో అప్పటినుంచి రాజకీయంగా ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉన్నారు. సినిమా టికెట్ల విషయంలో వివాదం, అలాగే సినిమా కథ విషయంలో వివాదం ఇలా పవన్ పై అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే పవన్ కళ్యాణ్ ఎవరైనా సినిమాపై రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వారిపై దాడులు చేయాలని సక్సెస్ మీట్ లో పరోక్షంగా అనడం గమనార్హం. మరి చూడాలి ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో

మరింత సమాచారం తెలుసుకోండి: