ప్రతి స్టార్ హీరో కెరీర్ కు సంబంధించి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. సినిమా రిజల్ట్ విషయంలో ఈ సెంటిమెంట్లు ఒకింత కీలక పాత్ర పోషిస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తారక్ షర్ట్ విప్పితే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. వార్2 సినిమాతో సైతం ఆ సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ కావడం పక్కా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టెంపర్ సినిమాలో తారక్ తొలిసారి సిక్స్ ఫ్యాక్ లుక్ లో కనిపించరు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు  అప్పట్లో 43 కోట్ల రూపాయాల షేర్ కలెక్షన్లు వచ్చాయి.  క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమా సక్సెస్ లో  కీలక పాత్ర పోషించింది.  ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత  వీర రాఘవ సినిమా కోసం కూడా షర్ట్  విప్పారు. ఈ సినిమాలో తారక్ లుక్ వేరే లెవెల్ లో ఉంటుంది.

ఈ సినిమాలో ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ లో తారక్ షర్ట్ విప్పగా  ఆ సీన్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. పరిమిత బడ్జెట్ తో థమన్ 100వ సినిమాగా తెరకెక్కిన అరవింద సమేత  వీర రాఘవ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన   సంచలనాలు అన్నీఇన్నీ కావు.  ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సైతం ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో తారక్ షర్ట్ లేకుండా కనిపించి  ప్రేక్షకుల మెప్పు పొందిన సంగతి తెలిసిందే.

వార్2 సినిమాలో సైతం తారక్  అలాంటి లుక్ లో కనిపించనుండటం సోషల్ మీడియా వేదికగా  హాట్ టాపిక్ అవుతోంది.  ఈ సినిమాలో తారక్ లుక్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  వార్2 సినిమా  బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ  పెరుగుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: