
అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఇది అంటూ ఎన్టీఆర్ కానీ ప్రశాంత్ నీల్ కానీ..ఎక్కడ అఫీషియల్ గా ప్రకటించలేదు . డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అంటూ టాక్ వినిపించింది తప్పిస్తే ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు . అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పృధ్వీరాజ్ ఆ విషయాన్ని కన్ఫామ్ చేసేసాడు. తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ ఆయన మాటల సందర్భంలో ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు . దీంతో ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయినట్లు అయింది .
ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బీజూ మీనన్ అలాగే యంగ్ హీరో తోవినో థామస్ కూడా నటిస్తున్నారు అని ప్రశాంత్ నీల్.. డ్రాగన్ లో ఆ ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు అని మంచి నటులుగా ప్రశాంత్ నీల్ వారికి తగిన ఇంపార్టెన్స్ ఇస్తాడు అనుకుంటున్నామంటూ ఓపెన్ గా చెప్పారు . "డ్రాగన్" సినిమా పేరు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఈ సినిమాకి హైలైట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ కుమారన్ మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి .
ఇప్పటివరకు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ఎవరు కూడా ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ కన్ఫామ్ చేయలేదు.. నువ్వు చేసేసావ్ థాంక్యూ బ్రో అంటూ కొంతమంది అంటూ ఉంటే.. నువ్వు చేసిన ఒక లీక్ వల్ల ఈ సినిమాకి 100 కోట్లు బొక్క పడే ఛాన్స్ ఉంది.. నీకు అర్థమవుతుందా..? అంటూ మండిపడే అభిమానులు కూడా ఉన్నారు. స్టార్స్ సినిమాల విషయంలో ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ కి స్పెషల్గా కేర్ తీసుకుంటారు మేకర్స్. టీజర్ కోసం ట్రైలర్ కోసం మూవీ గ్లింప్స్ కోసం హీరో ఇంట్రడక్షన్ క్యారెక్టర్ కోసం రకరకాలుగా సోషల్ మీడియాలో హైప్ పెంచుతూ ఉంటారు . కానీ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ టైటిల్ ఇంత ఈజీగా బయటపడిపోవడంతో కొంచెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు..!!