ప్రముఖ స్టార్ బ్యూటీ శృతిహాసన్ త్వరలో `కూలీ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా అలరించనున్నారు. ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్య రాజ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ ద్వారా మేక‌ర్స్ మరింత హైప్ పెంచుతున్నారు.


అందులో భాగంగా గ‌త వారం రోజుల నుంచి కూలీ ప్రమోషన్స్ లో శృతిహాసన్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్.. కూలీ చిత్రంలో తనకు ఎలా ఛాన్స్ వచ్చిందో వివరించింది. ఓ ఆల్బమ్ కోసం లోకేష్ కనగరాజ్ ను కలిశాన‌ని.. ఆ ఆల్బమ్ వర్క్ జరుగుతున్న‌ప్పుడే స్టోరీ గురించి చెప్పార‌ని శృతి పేర్కొంది. లోకేష్ చెప్పిన స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ తనకు బాగా నచ్చిందని.. స‌త్య‌రాజ్ కూతురిగా తాను ఈ సినిమాలో క‌నిపిస్తాన‌ని తెలిపింది.


ర‌జ‌నీకాంత్‌, నాగార్జున, ఉపేంద్ర‌, అమీర్ ఖాన్ వంటి సూప‌ర్ స్టార్స్ అంద‌రితో ఒకేసారి ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ రావ‌డం నిజంగా త‌న అదృష్ట‌మ‌ని శృతి హాస‌న్ ఆనందం వ్య‌క్తం చేసింది. ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో త‌న డ్రీమ్ రోల్ ఏంటో కూడా రివీల్ చేసింది. సంగీతం అంటే చాలా ఇష్టం.. ఏదైనా సినిమాలో మ్యూజిషియన్‌ రోల్‌ ప్లే చేయాలని ఎప్ప‌టినుంచో కోరుకుంటున్నాన‌ని శృతి హాస‌న్ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం శృతి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌డంతో.. పాప టేస్ట్ అదిరిపోయిందని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: