ఈ మధ్య కాలంలో చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో హింస అనేది ఎక్కువగా చూపిస్తున్నారు. ఈ హింస అనే కాన్సెప్ట్ ను ఎంత ఎక్కువగా చూపిస్తే సినిమాలు అంత హిట్ అవుతాయి అనుకుంటున్నారు.కానీ ఈ
డైరెక్టర్ సినిమాలో అసలు హింస అనేది ఎక్కువగా కనిపించదు. ఇక ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే
డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఇతర దర్శకులు సినిమాల్లో కనిపించే అశ్లీలత,హింస అనేది
శేఖర్ కమ్ముల తీసే సినిమాల్లో చాలా తక్కువ మోతాదులో కనిపిస్తుంది. అయితే అలాంటి
డైరెక్టర్ శేఖర్ కమ్ముల డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో
ఇండస్ట్రీ లోకి
డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈయన తీసిన ప్రతి
సినిమా సమాజంలో ఏదో ఒక విధంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది.
అలాంటి
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో
హ్యాపీడేస్,ఆనంద్,ఫిదా, కుబేర, లీడర్,
లవ్ స్టోరీ,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,గోదావరి వంటి ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పటివరకు ఈయన తీసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు హిట్స్ గానే నిలిచాయి. అయితే అలా అని
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మీద ఒక రూమర్ కూడా ఉంది. అదేంటంటే
శేఖర్ కమ్ముల ఓ కుర్ర
హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారని,అందుకే ఆ కుర్ర
హీరోయిన్ ని తన సినిమాలో ఎక్కువగా రిపీట్ చేస్తారు అనే టాక్ ఉంది. అయితే ఈ విషయం గురించి మరింత క్లారిటీగా అడిగారు ఓపెన్
హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో ఆర్కే రాధాకృష్ణ.. మీరు ఒక యంగ్
హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారని, ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి .
ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటూ
శేఖర్ కమ్ములను అడగగా.. అదంతా రూమర్ మాత్రమే..ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ కొట్టి పారేశారు. ఇక ఆ
హీరోయిన్ ఎవరంటే కమలిని ముఖర్జీ. అయితే
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన గోదావరి,ఆనంద్ వంటి రెండు సినిమాల్లో వరుసగా కమలిని ముఖర్జీని తీసుకున్నారు. అలాగే
హ్యాపీడేస్ లో కూడా ఓ స్పెషల్ పాత్ర కోసం కమలిని ముఖర్జీని హీరోయిన్గా తీసుకున్నారు. దీంతో చాలామంది అప్పటి జనాలు
శేఖర్ కమ్ములకి కమలిని ముఖర్జీతో ఎఫైర్ ఉందని, అందుకే తన సినిమాల్లో వరుసగా ఆమెనే తీసుకుంటున్నారనే ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణలను ఓపెన్
హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో ఖండించిన
శేఖర్ కమ్ముల అసలు విషయం చెప్పారు.నేను నా సినిమాల్లో ఎక్కువగా కంఫర్ట్ ఉన్న వారినే రిపీట్ చేస్తూ ఉంటాను. అలా
హీరో హీరోయిన్ల నుండి మొదలు రైటర్, సినిమాటోగ్రాఫర్ ఇలా చాలామందిని ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటాను. అలాగే కమలిని ముఖర్జీని కూడా తీసుకున్నాను. ఇక
హ్యాపీడేస్ సినిమాలో ఆమె పోషించిన పాత్ర కోసం వేరే
హీరోయిన్ ని అనుకున్నాం. కానీ రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో వాళ్ళని పక్కనపెట్టి కమలిని ముఖర్జీని తీసుకున్నాం.కమలిని ముఖర్జీ మా బడ్జెట్ లోనే వచ్చేసింది. అందుకే పెట్టాల్సి వచ్చింది. అలాగే ఆమెతో ఎఫైర్ ఉన్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ కొట్టిపారేసారు.