తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన సినిమాటో గ్రాఫర్లలో కార్తీక్ ఘట్టమనేని ఒకరు. ఈయన ఎన్నో సినిమాలకు సినిమాటో గ్రాఫర్ గా పని చేసి మంచి సినిమాటో గ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత డైరెక్టర్ గా టర్ను తీసుకున్నాడు. అందులో భాగంగా ఈయన ఇప్పటివరకు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితం ఈయన మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈయన తేజ సజ్జ హీరో గా రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా  జరుగుతుంది. ఈ మూవీ విడుదల అయిన తర్వాత కార్తీక్ ఘట్టమనేని ఓ క్రేజీ కాంబో మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , టాలీవుడ్ టాలెంటెడ్ క్రేజీ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి బాబి కొల్లి తో మూవీ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నట్లు , ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని పనులు కూడా ముగిసినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఓవర్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం చిరంజీవి హీరో గా బాబి దర్శకత్వంలో వాల్టేరు వీరయ్య అనే సినిమా రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి ఈ క్రేజీ కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: