పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుసగా సినిమాలకు కమిట్ అయిపోతున్నాడు. మరీ ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ డైరెక్టర్లకే ఛాన్స్ ఇస్తున్నాడు . ప్రెసెంట్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్  సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.  ఆ తర్వాత సల్లార్ 2 ని సెట్స్ పైకి తీసుకొనిరాబోతున్నారు . అదేవిధంగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కే "ఫౌజీ".. అదే విధంగా టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కే "స్పిరిట్" సినిమాలను కూడా ఆల్టర్నేట్ గా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.


ఈ సినిమాలు అన్ని అయిపోగానే  కల్కి 2 ని కూడా సెట్స్ పైకి తీసుకుని వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి . ఇవన్నీ సెట్స్ పై ఉండగానే మరొక క్రేజీ కాంబో కి సైన్ చేశాడు ప్రభాస్ అంటూ సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు కొరటాల శివ . కొరటాల శివ - ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమా "మిర్చి". ఈ సినిమాను అంత ఈజీగా అభిమానులు మర్చిపోలేరు. ప్రభాస్ లోని మరో స్టైల్ ని జనాలకు పరిచయం చేసింది ఈ మూవి. మరీ ముఖ్యంగా ప్రభాస్ కి క్లాస్ హిట్ తెచ్చి పెట్టిన మూవీ మిర్చి అనే చెప్పాలి. ఈ కాంబో కోసం చాలా మంది వెయిట్ చేశారు .



ఇన్నేళ్లకి మళ్ళీ ఈ కాంబో సెట్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కొరటాల శివ త్వరలోనే దేవర 2 సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చి చకచక ఫినిష్ చేసేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. ఆ సినిమా షూట్ కంప్లీట్ అయిపోగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట . ఆల్ రెడి స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్నారట . కానీ మిర్చి సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు అనే తెలుస్తుంది . ఇది ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కబోతున్న లవ్ స్టోరీ అనే టాక్ బయటకి వచ్చింది. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: