
జపాన్లో నాగార్జున అభిమానులు సోషల్ మీడియాలో తెలుగు చిత్రాల పైన చూపిస్తున్న ఆదరణ కొత్తేమి కాదు. గతంలో ఎన్నో చిత్రాలపై చూపించారు. బ్రహ్మాస్త్ర సినిమా విడుదలైన తర్వాత నాగార్జునకు అక్కడ ప్రత్యేకించి అభిమానం ఏర్పడిందట. నాగార్జున నటించిన అనీష్ శెట్టి పాత్ర అక్కడివారిని బాగా ఆకట్టుకుంది. బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున స్టైలిష్ లుక్ లో ,హుందాతనంతో ఆకట్టుకున్నారు. కుబేరా సినిమా అక్కడ విడుదల కావడంతో ఈ సినిమా చూసిన అభిమానులు..#nagasama అనే యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.
అయితే జపాన్ భాషలో మాత్రం సామా అంటే చాలా గౌరవమైన పదమని .. రాజులు, దేవుళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే ఇలాంటి హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగిస్తారట.. అందుకే నాగార్జున పేరుకు ముందు కూడా నాగ్ - సామా అని అభిమానులు ఎంతో గౌరవంతో పిలుచుకుంటున్నారు. ట్విట్టర్లలో నాగార్జున నటించిన సినిమా పాత్రలను కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. కుబేరా సినిమాలో నాగార్జున దీపక్ పాత్రలో అద్భుతంగా జీవించారని.. ఈ చిత్రంలో తన పండించిన ఎమోషన్స్ వళ్ల ఫ్యాన్ బేస్ కూడా పెరగడానికి ముఖ్య కారణం అయ్యిందట. రజనీకాంత్ నటించిన కూలి చిత్రంలో కూడా ఉన్నారని తెలిసి అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారట. జపాన్ లో నాగార్జున క్రేజీని చూసి ఇక్కడి వారు ఆశ్చర్యపోతున్నారు.