ఒక అమ్మాయి , అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత వారు కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చినట్లయితే వారికి సంతానం ఉన్నట్లయితే వారి సంతానం బాగుండడం కోసం , వారు జీవిత కాలం బాగా బ్రతకడం కోసం  అబ్బాయి ఆస్తి నుండి ఎంతో కొంత ఆస్తి ఇవ్వడం లేదా నెలసరి జీతం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఆ జంటకు పిల్లలు లేనట్లయితే ఆ అమ్మాయి ఎవరిపై ఆధారపడకుండా బ్రతకడం కోసం ఎంతో కొంత డబ్బులను ఇచ్చే విడాకులను సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే కొంత మంది విషయంలో ఇది వేరేలా ప్రొజెక్ట్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఒక మహిళ తన మొదటి భర్త నుండి విడాకులు తీసుకోవడానికి అతని దగ్గర నుండి 20 లక్షలు తీసుకొని సెటిల్మెంట్ చేసుకుంది.

ఇక మొదటి భర్త నుండి 20 లక్షలు తీసుకొని విడాకులు తీసుకొని సెటిల్మెంట్ చేసుకున్నాక ఈమె అప్పటికే పెళ్లి అయ్యి విడాకులు అయిన మరో వ్యక్తి ని పెళ్లి చేసుకుంది. ఇకపోతే ఈ సంసారం కూడా ఎక్కువ రోజులు సజావుగా సాగలేదు. ఈమె రెండో పెళ్లి చేసుకున్న భర్త నుండి కూడా విడాకులు తీసుకోవడానికి రెడీ అయింది. కానీ ఈ సారి రెండవ భర్త నుండి విడాకులు తీసుకోవడానికి ఈమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె రెండవ భర్త నుండి విడాకులు తీసుకోవడానికి ఏకంగా 12 కోట్ల రూపాయలు , ఒక bmw  కారు , అలాగే నాలుగు నుండి ఐదు కోట్ల విలువ చేసే ప్లాట్ కావాలి అని ఆమె డిమాండ్ చేస్తుందట.

ఇకపోతే ఈమె మంచి చదువు కూడా చదువుకొని ఉంది. ఈమె ఇంజనీరింగ్ మరియు ఎంబీఏ పూర్తి చేసి ఉంది. దానితో ఈమె అంత మంచి చదువు చదివింది. ఈమె భర్త నుండి విడిపోయిన కూడా మంచి ఉద్యోగం చేసుకొని ఎంతో మంచి స్థాయిలో బ్రతకవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈమె పెళ్లిళ్లు చేసుకొని భర్తల దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేస్తుండడంతో ఈ వార్త చాలా పెద్ద వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: