సోషల్ మీడియా ఎప్పుడు ఏ స్టార్ ట్రెండ్ అవుతారు..? ఎప్పుడు ఏ స్టార్ ట్రోల్ కి గురవుతారో..? అర్థం కాని విధంగా తయారైపోయింది . నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఎవర్  గ్రీన్ ట్రెండింగ్ లో ఉన్న పేరు మాత్రం రష్మిక మందన్నానే. ఏ స్టార్ హీరో చూసిన ఏ స్టార్ డైరెక్టర్ చూసిన .. ఏ బిగ్ బడా పాన్ ఇండియా మూవీ చూసిన అన్ని చోట్ల రష్మిక మందన్నా.. రష్మిక మందన్నా.. రష్మిక మందన్నా.. అన్న పేరు ఎక్కువ వినిపిస్తూ వచ్చింది. అయితే సడన్గా ఓవర్ నైట్ లో ఆ పేరుని వెనక్కి నెట్టేసి ట్రెండింగ్లోకి వచ్చేసింది మరో హీరోయిన్ .


ఆమె మరెవరో కాదు "భాగ్యశ్రీ బోర్సే". ఇండస్ట్రీలో సైలెంట్ గా స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతున్న ఈ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తాజాగా నటించిన సినిమా "కింగ్డమ్".  విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరో గా కనిపించాడు. విజయ్ దేవరకొండ - భాగ్యశ్రీ బోర్సే కలయికలో వచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది . ఆఫ్ కోర్స్ అడపాదడపా నెగిటివ్ టాక్ వినిపిస్తున్న విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేసింది . ఈ సినిమాలో విజయ్ పర్ఫామెన్స్ కూడా కొత్తగా ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .



అదేవిధంగా భాగ్య శ్రీ నటన ఈ సినిమాలో మరింత హైలెట్ అయింది అంటూ మాట్లాడుకుంటున్నారు . భాగ్యశ్రీ బోర్సే కంటి చూపుతోనే సినిమా ఇండస్ట్రీని చంపేస్తుంది అని .. ఆమె ఆ కళ్ళతో కుర్రాళ్ళను గిలిగింతలు పెట్టేస్తుంది అంటూ కుర్రాళ్ళు మాట్లాడుకుంటున్నారు . ఇండస్ట్రీలో తోపైన హీరోయిన్ ల లిస్ట్ లోకి యాడ్ అయ్యే సత్తా ఈ భాగ్యశ్రీ బోర్సే కి ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు పెట్టుకుని ఉంది . ఈ మూడు సినిమాలు హిట్ అయితే మాత్రం ఇక భాగ్యశ్రీ బోర్సే టాప్ హీరోయిన్ అయిపోయిన్నట్లే. మరి ముఖ్యంగా రామ్ పోతినేని తో భాగ్యశ్రీ  ప్రేమాయణం నడుపుతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి . దానిపై అటు రాంపోతినేని ఇటు భాగ్యశ్రీ ఇద్దరు స్పందించకపోవడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: