కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. 2016లో విడుదలైన `రెమో` చిత్రం తెలుగు వారికి శివ కార్తికేయ‌న్‌ను బాగా దగ్గర చేసింది. ఆ తర్వాత ఆయన త‌మిళంలో న‌టించే చిత్రాలను తెలుగులోనూ రిలీజ్ చేయడం షురూ చేశారు. ఇటీవ‌ల కాలంలో `డాక్టర్`, `డాన్`, `మావీరన్`, `అమరన్` వంటి సినిమాలు శివ కార్తికేయన్ మార్కెట్ ను భారీగా పెంచాయి. ప్రస్తుతం ఏఆర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో `మ‌ద‌రాశి` అనే చిత్రం చేస్తున్నాడు. అలాగే సుధా కొంగ‌ర డైరెక్ష‌న్ లో `పరాశక్తి` అనే మూవీకి సైన్ చేశాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.


ఈ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోల్లో శివ కార్తికేయ ఒకరు. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు ప‌ర్స‌న‌ల్‌ లైఫ్ ఫోటోల‌ను కూడా శివ కార్తికేయన్ తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శివ కార్తికేయనుకు 8.5 మిలియన్లు అంటే దాదాపుగా 85 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆయన ఫాలో అయ్యేది మాత్రం ఒకే ఒక్కరిని. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరో తెలుసా ఆయన సతీమణి ఆర్తి.


శివకార్తికేయన్ 2010 ఆగస్టు 27న ఆర్తిని వివాహం చేసుకున్నారు. వీరిది పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి. అయితే చిన్న‌త‌నం నుంచి శివ కార్తికేయ‌న్‌, ఆర్తిల‌కు ఒక‌రికొక‌రు తెలుసు. ఈ దంపతులకు  2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్‌ దాస్‌ జన్మించారు. 2024లో ముచ్చ‌ట‌గా మూడోసారి శివ కార్తికేయ‌న్‌, ఆర్తి దంప‌తులు త‌ల్లిదండ్రులు అయ్యారు. మూడో సంతానంగా పవన్ అనే కుమారుడికి జ‌న్మ‌నిచ్చారు.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: