ఆరు పదుల వయసులోనూ ఎనర్జీకి, కమిట్‌మెంట్‌కు మారుపేరు మెగాస్టార్ చిరంజీవి. యువ హీరోలకే గట్టి పోటీ ఇచ్చేలా వ‌రుస సినిమాలు చేస్తున్న చిరూ, ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వాటిలో “విశ్వంభర” షూటింగ్ పూర్తయింది. సూపర్ ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ సినిమానికి వశిష్ఠ దర్శకత్వం వహించగా, త్రిష , ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతం ఇచ్చేది మ్యూజిక్ మ్యాజీషియన్ ఎం.ఎం.కీరవాణి!

ఇక “మెగా157” సినిమాతో చిరంజీవి, మాస్ ఎంటర్టైనర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌కి సెట్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ స్పీడ్‌గా నడుస్తుండగా, సంక్రాంతి 2026ని టార్గెట్ చేసుకున్నారు. ఇక బర్త్ డే బ్లాస్ట్ విషయంలోకి వస్తే… ఈ ఆగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్లు ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్ ప్లాన్ చేశాయి.

ట్రీట్ 1:
విశ్వంభర నుంచి ఒక స్పెషల్ వీడియోతో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఏ కాదు, టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది.

ట్రీట్ 2:
మెగా157 టైటిల్‌ను కూడా అదే రోజున రివీల్ చేయనున్నారని బలమైన వార్తలు వస్తున్నాయి. చిరూ & అనిల్ రావిపూడి కాంబోలో ఫస్ట్ టైమ్ వస్తున్న సినిమా కావడంతో ఈ అప్‌డేట్ పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రీట్ 3:
మెగా158 ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారట. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ఈ మూవీ ఉండబోతోందని సమాచారం. మాస్, ఎమోషన్ మిక్స్‌తో వచ్చే ఈ ప్రాజెక్ట్ కూడా మెగా ఫ్యాన్స్‌కి ఓ గ్రాండ్ గిఫ్ట్‌గా మారబోతోంది.

చిరంజీవి బర్త్ డే రోజు మూడు భారీ అప్‌డేట్స్… మూడు సరికొత్త ఆరంభాలు! ఫ్యాన్స్‌కి ఫుల్ మాస్ మీల్స్ రాబోతున్నాయి. మిగిలిన హీరోలు ఒక్క టీజర్‌తోనే సరిపెడతే… మెగాస్టార్ మాత్రం మూడింటిని ఒకే రోజు మాస్ ట్రీట్‌గా అందించబోతున్నాడు. ఆగస్ట్ 22న మెగా బ్లాస్టింగ్ గ్యారంటీ!

మరింత సమాచారం తెలుసుకోండి: