
ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ అందరి హీరోయిన్లతో చనువుగా ఉంటారు . లిమిట్స్ లోనే ఉంటారు . ఎక్కడ హద్దులు మీరరు. అయితే ప్రభాస్ తల్లిని ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో తోటి బంధువులు సరదాగా క్వశ్చహ్న్ చేయగా .. ప్రభాస్ పక్కన ఏ హీరోయిన్ బాగుంటుంది ..?ఏ హీరోయిన్ ఆయనకు సూట్ అవుతుంది..? అని ప్రశ్నించగా .. ప్రభాస్ తల్లి "ప్రభాస్ పక్కన అందరి హీరోయిన్స్ బాగుంటారు. కానీ ఒక హీరోయిన్ చూస్తే మాత్రం నాకు ప్రభాస్ కి చెల్లిలా అనిపించింది . ఆమె మరెవరో కాదు దీక్ష సేధ్. రెబల్ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్. ఇద్దరి హైట్ నాకు ఒకేలా అనిపించింది . ఇద్దరు పక్కపక్కన చూస్తుంటే అన్నాచెల్లెలు లా అనిపించారు " అంటూ చెప్పుకొచ్చిందట .
అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయ్యింది. మరొకసారి ప్రభాస్ అభిమానులు ఈ వార్తని ట్రెండ్ చేస్తున్నారు . దీక్ష సెధ్ లాంటి హాట్ హీరోయిన్ ని ప్రభాస్ కి చెల్లిని చేసేసావా..? అమ్మ అంటూ అప్పట్లో కొంతమంది నాటిగా కూడా మాట్లాడారు. కాగా ప్రభాస్ - హీరోయిన్ అనుష్క ప్రేమించుకుంటున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేదు. వాళ్లు కూడా మేము ప్రేమించుకుంటున్నామని చెప్పలేదు . సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!