ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది సమంత పేరు.. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో  సమంత రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఇక ఈ వార్తలకు తగ్గట్టుగానే సమంత ప్రతిసారి బాయ్ ఫ్రెండ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని వెకేషన్లు,డిన్నర్ డేటింగ్ లు అంటూ తిరుగుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ఇప్పటికే పలు వెకేషన్ లకి వెళ్లిన సమంత రీసెంట్ గా ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళిన సమయంలో ఒకే కారులో ప్రయాణించి మరోసారి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు.  అలాంటి సమంత గురించి తాజాగా మరో వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. 

సమంత రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది అని, తన చేతి వేలికి ఉండే రింగ్ ఎంగేజ్మెంట్ రింగేకనని,అందుకే సమంత అంత స్పెషల్ గా దాన్ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక మరి కొంతమందేమో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం సమంత కి ఏముంది..ఏదైనా ఉంటే అఫీషియల్ గా అందరికీ చెప్పే చేసుకుంటుందిగా అని అంటే.. లేదు లేదు పెళ్లి అయ్యాక ఈ విషయాన్ని బయటపెడదాం అనుకుంటుంది కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా మరో బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే సమంత రాజ్ నిడిమోరుతో రెండో పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత రెండో పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి సినిమాలను పూర్తిగా పక్కన పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం సమంత ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత రాజ్ నిడిమోరు తో తన జీవితాన్ని హ్యాపీగా గడపాలని చూస్తోందట. ఇక సినిమాలని పక్కనపెట్టి బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుందట. అంతేకాదు రాజ్ నిడిమోరు తో రెండో పెళ్లి తర్వాత సమంత తన కొత్త జీవితాన్ని విదేశాల్లో ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలా ఇండియాకి పూర్తిగా గుడ్ బై చెప్పి పూర్తిగా విదేశాల్లోనే సెటిల్ అవ్వాలని చూస్తున్నట్టు టాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: