టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరోసారి చీకటి కబురు వెలుగులోకి వచ్చింది. డ్యాన్స్ షోలు, సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ఇప్పుడు తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో (POCSO) కేసు నమోదు కాగా, గచ్చిబౌలి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కొన్ని రోజుల క్రితమే జరిగిందని, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కి వచ్చిన బాలిక తల్లిదండ్రులు, కృష్ణ మాస్టర్ తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించాడని తీవ్ర ఆరోపణలు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు, అతను పరారీలోకి వెళ్లడంతో గాలింపు ప్రారంభించారు. తాజాగా బెంగుళూరులోని తన అన్న ఇంట్లో ఉన్నాడని నిఘా పెట్టి, అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కి తీసుకువచ్చారు.


కేవలం ఇదేకాక, కృష్ణ మాస్టర్ పైన గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఓ మహిళను పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆమె దగ్గర నుంచి రూ.9 లక్షల నగదు తీసుకొని కనిపించకుండా పోయినట్టు సమాచారం. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పలు యువతులను మోసం చేశారన్న వార్తలు కూడా బయటపడుతున్నాయి. ఆయన ప్రవర్తనపై సోషల్ మీడియాలో కూడా మండిపడుతున్నారు. ఒకప్పుడు డ్యాన్స్ స్టేజిపై ఊపుమీదున్న కృష్ణ మాస్టర్ ఇప్పుడు జైలుజెండా పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినీ పరిశ్రమలో పలు టాలెంట్ షోల ద్వారా వెలుగులోకి వచ్చిన కృష్ణ మాస్టర్, ఒకరిని ఆరాధించే స్థాయికి చేరినప్పటికీ, ఆ నమ్మకాన్ని తుంచేయడం బాధాకరమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇండస్ట్రీలో మరోసారి మాస్టర్ల పై నమ్మకాన్ని దెబ్బతీసే ఘటనగా ఈ కేసు నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కృష్ణ మాస్టర్ కంది జైలులో రిమాండ్‌లో ఉన్నారు. మరి ఈ కేసులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: