యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌చ్చిన యాక్షన్ డ్రామా `దేవర: పార్ట్ 1` ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఎన్టీఆర్ సోలోగా చేసిన చిత్రాల్లో రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం దేవ‌ర పార్ట్ 2 కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. అయితే ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్డేట్ తాజాగా తెర‌పైకి వ‌చ్చింది. ఎన్టీఆర్ ఇప్ప‌టికే `వార్ 2`ను కంప్లీట్ చేసేశాడు. ఆగ‌స్టులో ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.


ప్ర‌స్తుతం తార‌క్ `డ్రాగ‌న్‌` మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. మ‌రోవైపు కొర‌టాల శివ దేవ‌ర 2కు సంబంధించి  స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఫ‌స్ట్ పార్ట్ హిట్ అయిన నేప‌థ్యంలో.. సెకండ్ పార్ట్ అంత‌కు మించే ఉండేలా కొర‌టాల ప్లాన్ చేస్తున్నార‌ట‌.


అన్ని అనుకున్న‌ట్లు కుదిరితే దేవర 2 వ‌చ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై నిర్మితం కానున్న ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా అల‌రించ‌నుంది. సైఫ్ అలీ ఖాన్, చైత్ర రాయ్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్ర‌కాశ్ రాజ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నుండ‌గా.. అనిరుధ్ రవిచందర్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: