
ఆర్.ఆర్.ఆర్.' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్ చెప్పిన కథకు కొన్ని మార్పులు అవసరమని భావించినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' ప్రాజెక్ట్ రామ్ చరణ్‌కు రావడంతో, ఆయన దానికే ప్రాధాన్యత ఇచ్చారని అప్పట్లో చెప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి గౌతమ్ తిన్ననూరి తాజాగా స్పందించారు.
గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఒక పాయింట్ ను చరణ్ కు చెప్పానని చరణ్ కు ఆ పాయింట్ నచ్చడంతో ఆ లైన్ తో స్టోరీ సిద్ధం చేశానని తెలిపారు. ఆ తర్వాత ఆ పాయింట్ చరణ్ కు సెట్ కాదని నాకే అనిపించిందని చెప్పుకొచ్చారు. చరణ్ నేను తరచూ మాట్లాడుకుంటూ ఉంటామని ఆయన అన్నారు. 'కింగ్‌డమ్' కథ మొదట రామ్ చరణ్‌కు చెప్పిందేనా అనే చర్చ విస్తృతంగా జరిగింది. అయితే, ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ వార్తలను ఖండించారు.
రామ్ చరణ్‌కు చెప్పిన కథ వేరని, 'కింగ్‌డమ్' కథకు దానితో సంబంధం లేదని స్పష్టం చేశారు. గౌతమ్ తిన్ననూరి కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ, తాను చరణ్‌కు వినిపించిన ఐడియా అప్పట్లో ఎగ్జైటింగ్‌గా ఉన్నా, పూర్తి స్క్రిప్ట్ రూపంలో అది చరణ్ స్థాయికి తగ్గట్టుగా రాలేదని ఒప్పుకున్నారు. మొత్తానికి, రామ్ చరణ్ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినప్పటికీ, భవిష్యత్తులో వీరిద్దరి కలయికలో ఒక మంచి సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.