సినీ కార్మికుల వేతన పెంపు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సినీ కార్మికులు అడిగిన స్థాయిలో వేతన పెంపు ఇవ్వలేమని నిర్మాతలు చెప్పడంతో ఈ వివాదం పెద్దదైంది. మరోవైపు యాక్టివ్ గిల్డ్ నిర్మాతలు యూనియన్లతో సంబంధం లేకుండా కార్మికులను నియమించుకునే దిశగా కూడా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయింది.

కార్మికులు కోరినట్టు వేతన పెంపును అమలు చేస్తే పెద్ద సినిమాలపై 10 కోట్ల రూపాయలు, చిన్న సినిమాలపై 2 నుంచి 3 కోట్ల రూపాయల మేర భారం పడే ఛాన్స్ అయితే ఉంది. ఈ స్థాయిలో భారం ప్రస్తుత నిర్మాతలు భరించే పరిస్థితి లేదు. ఈ ఏడాది విడుదలై హిట్టైన సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. గతంతో పోల్చి చుస్తే శాటిలైట్ ఆదాయం సైతం తగ్గింది. ఓటీటీల వల్ల పెద్ద బ్యానర్ల నిర్మాతలకు  కొంతమేర ఇబ్బందులు లేవు.

కార్మికులు, నిర్మాతల మధ్య వివాదం అంతకంతకూ  పెద్దదైన నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలకు చిరంజీవి  కొన్ని సూచనలు చేశారని తెలుస్తోంది.  ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చిరంజీవి చేసిన సూచనల గురించి చెప్పుకొచ్చారు.  చిరంజీవి నిర్మాతల నిర్ణయాన్ని అడిగి మరీ తెలుసుకున్నారని ఆయన తెలిపారు. యూనియన్ నాయకుల వాదన సైతం వినాలని చిరంజీవి చెప్పారని సి.కళ్యాణ్ కామెంట్లు చేశారు.

మూడు రోజుల్లో ఇరు వర్గాలు  సామరస్యంగా పరిష్కరించుకోవాలని చిరంజీవి సూచించారని ఆయన తెలిపారు. అప్పటికీ సమస్య పరిష్కారం కానీ పక్షంలో తాను జోక్యం చేసుకుంటానని చిరంజీవి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 10 శాతం పెంపు వరకు నిర్మాతలు అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. చిరంజీవి జోక్యం చేసుకుంటే ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోనున్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: