
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. పవన్ వేగంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ పూర్తీ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. పవన్ సపోర్ట్ వల్లే ఈ షెడ్యూల్ వేగంగా పూర్తయిందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. "మాటిస్తే నిలబడటం.. మాట మీదే నిలబడటం.. మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే" అంటూ పవన్ తో దిగిన ఫోటోను హరీష్ శంకర్ పంచుకున్నారు. ఈరోజును నా లైఫ్ లో ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన అన్నారు.
పవన్ ఎనర్జీ సినిమాకు మరింత పవర్ ను ఇచ్చిందని సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని హరీష్ శంకర్ తెలిపారు. హరీష్ శంకర్ షేర్ చేసిన ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. సింపుల్ లుక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదుర్స్ అనేలా ఉన్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా తేరి సినిమాకు రీమేక్ అయినప్పటికీ మెయిన్ లైన్ ను మాత్రమే తీసుకున్నారని భోగట్టా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. శ్రీలీల, రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.