రవితేజ శ్రీలీల కాంబినేషన్లో ఇప్పటికే ధమాకా మూవీ వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు ధమాకా మూవీతో రవితేజ 100 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయారు. అప్పటివరకు వరుస ఫ్లాపుల్లో మునిగిపోయిన రవితేజకు ధమాకా మూవీ మంచి హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాలు కూడా అంతగా హిట్ కాలేదు. దాంతో రవితేజ మళ్ళీ హిట్ కొట్టాలని చూస్తున్న తరుణంలో ధమాకా మూవీ కాంబో ని రిపీట్ చేస్తూ మాస్ జాతర పేరుతో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్,ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి నాగ వంశీ నిర్మాతగా చేస్తున్నారు.

 అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి తూ మేరీ లవర్ అనే పాట ఎంత వైరల్ గా మారిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమాలో ఇడియట్ మూవీలోని చక్రి అందించిన నీ కళ్ళు పేలిపోను చూడవే అనే మ్యూజిక్ ని యాడ్ చేస్తూ సాంగ్ ని అద్భుతంగా తీశారు. మాస్ జాతర నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ అద్భుత హిట్ కొట్టడంతో ఈ సినిమా నుండి తాజాగా ఓలే ఓలే అనే మాస్ పాటని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.అయితే తాజాగా విడుదలైన పాటపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఓలే ఓలే పాటలో బూతులు ఉన్నాయని ఓవర్గం వాళ్లు ఈ పాట రాసిన రచయితని తిట్టిపోస్తున్నారు.ముఖ్యంగా ఓలే ఓలే పాటలో  నీ అమ్మని.. అక్కని.. అంటూ బూతు పదాలు అనిపించే లిరిక్స్ ని రచయిత భాస్కర్ యాదవ్ ఎందుకు రాసారు అంటూ ఆయన పై మండిపడుతున్నారు

  అంతేకాదు ఈ పదాలు వినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయని రచయితపై ఫైర్ అవుతున్నారు. కానీ రవితేజ కి ఉన్న మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని రచయిత భాస్కర్ యాదవ్ పాటలో ఇలాంటి పదాలు యాడ్ చేశారని పాట ఎంతగానో నచ్చిన అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. అంతేకాదు జానపదం లో ఇలాంటి పదాలు అసలు బూతులు కావని, ముందు అది తెలుసుకొని స్పందించండి అంటూ రీ కౌంటర్లు ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఓలే ఓలే పాట గురించి ప్రస్తుతం నెట్టింట్లో చర్చ జరుగుతుంది.మరి ఈ పాటలోని లిరిక్స్ పై వచ్చిన నెగిటివిటీపై చిత్ర యూనిట్, రచయిత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: