సాధారణంగా ఏజ్ పెరిగే కొద్దీ గ్లామర్ అనేది తగ్గుతూ వస్తుంది. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. వయసు పెరుగుతున్న చెక్కుచెదరని గ్లామర్ మరియు ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకరు. 65లోనూ ఈయన నవ మన్మధుడే. ఆయనతో కెరీర్ ప్రారంభించిన మిగతా హీరోలంతా కాస్త కూసో బరువు పెరిగారు. కానీ నాగార్జున మాత్రం అంతే ఫిట్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తూ అంద‌ర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఇంత యంగ్ గా కనిపించడం వెనక రీజన్ అడిగితే.. కూలీ ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో నాగార్జున తాను ఫాలో అయ్యే తొమ్మిది హెల్త్ సీక్రెట్స్ ను రివీల్ చేశారు.


1. నాగార్జున త‌న డేను ప్రోబయోటిక్స్‌తో ప్రారంభిస్తారు. ఉద‌యం లేవ‌గానే వ్యాయామానికి ముందు కిమ్చి, పులియబెట్టిన క్యాబేజీ వంటి కొన్ని సహజ ప్రోబయోటిక్స్ తో పాటు గోరువెచ్చని నీరు మరియు కాఫీ తీసుకుంటారు. మెట‌బాలిజంను ప్రారంభించడానికి మరియు శక్తివంతంగా ఉండటానికి ఈ సహజ ప్రోబయోటిక్స్ స‌హాయ‌ప‌డ‌తాయ‌ని నాగ్ తెలిపారు.


2. నాగ్ ఇప్ప‌టికీ హెల్తీగా, హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నారంటే.. అందుకు మెయిన్ రీజ‌న్ వ్యాయామాలు చేయ‌డ‌మే. ఇత‌ర విష‌యాల్లో కాస్త రిలీక్స్ గా ఉన్న‌.. ఎక్స‌ర్‌సైజ్ ను మాత్రం స్కిప్ చేయ‌ర‌ట‌. వారానికి ఐదు రోజులు, వీలైతే ఆరు రోజులు ఖచ్చితంగా వ్యాయామం చేస్తారు. దాదాపు 35 ఏళ్ల నుంచి ఈ రూల్‌ను ఆయ‌న ఫాలో అవుతున్నారు.


3. వ్యాయామంలో వైవిధ్యం ఉండేలా చూసుకోవ‌డం నాగార్జున పాటించే మ‌రొక ముఖ్య నియ‌మం. రోజుకు దాదాపు 45 నిమిషాల నుండి ఒక గంట వరకు వ్యాయామం చేస్తారు. అయితే ఒకే టైపు వర్కౌట్స్ కాకుండా ఒక‌ రోజు ట్రెడ్ మిల్ మీద రన్నింగ్, మ‌రొక రోజు వెయిట్ ట్రైనింగ్,  ఒక రోజు స్విమ్మింగ్, మరో రోజు వాకింగ్ ఇలా భిన్న రకాల వర్కౌట్స్ చేస్తూ శరీరానికి కొత్త ఉత్సాహం అందిస్తాన‌ని నాగార్జున తెలిపారు.


4.  ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి మరియు జీవక్రియను పెంచడానికి, ఏదైనా వ్యాయామం చేసేట‌ప్పుడు హృదయ స్పందన రేటును 70 శాతం కంటే ఎక్కువగా ఉండేలా చూసుకుంటాన‌ని.. వర్కౌట్స్ చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోవ‌డం, మొబైల్ చూప‌డ‌టం వంటివి అస్స‌లు చేయ‌న‌ని నాగార్జున పేర్కొన్నారు.


5.డైట్ విష‌యానికి వ‌స్తే.. నాగార్జున 12:12 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతిని అనుస‌రిస్తారు. అంటే డేలో 12 గంట‌లు అన్ని ర‌కాల పోష‌కాలు శ‌రీరానికి అందేలా ఫుడ్ తీసుకుంటారు. మ‌రో 12 గంట‌లు ఉప‌వాసం ఉంటారు.


6. అలాగే లంచ్‌లో పప్పు, కూర, పచ్చడి, నాన్‌వెజ్‌తో సంపూర్ణ భోజనం చేస్తారు. డిన్స‌ర్‌లో సలాడ్స్‌, చికెన్ లేదా ఫిష్ ఉండేలా చూసుకుంటారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఎప్పుడు ఏ ఆహారం తిన్న నైట్ డిన్నర్ ను మాత్రం క‌చ్చితంగా 7 నుంచి 7.30 మధ్యలో పూర్తి చేసేస్తార‌ట‌.


7. వారంలో ఆరు రోజుల డైట్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే నాగార్జున‌.. ఆదివారం ఒక్క‌రోజు మాత్రం త‌న‌కిష్ట‌మైన స్వీట్స్‌, ఇత‌ర ఫుడ్స్‌ను లాగించేస్తార‌ట‌. ఇంట్లో ఉంటే హైద‌రాబాద్ బిర్యానీ ఉండాల్సిందే అట‌.


8. నాగార్జున తన ఫిట్‌నెస్ కోసం నిద్ర మరియు హైడ్రేషన్ కు కూడా అధిక ప్రాధాన్య‌త ఇస్తారు. లేట్ నైట్ షూటింగ్‌లు లేకపోతే ప్రతిరోజూ ఒకే టైంకి పడుకుంటారు. వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాల‌న్నా, రోజును ఉల్లాసంగా ప్రారంభించాల‌న్న నిద్ర చాలా ముఖ్య‌మ‌ని నాగార్జున పేర్కొన్నారు.


9. సెలబ్రిటీల లైఫ్‌లో ఒత్తిడులు తప్పవు. కానీ అవసరం లేని విషయాల గురించి ఆలోచించొద్దని నాన్న‌గారు చెప్పార‌ని.. ఆయ‌న మాట‌ల‌ను ఇప్ప‌టికీ తాను అనుస‌రిస్తున్నాన‌ని నాగార్జున తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: