"మధుప్రియ".. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? అందరికీ బాగా తెలిసిన వ్యక్తి . ఫోక్ సింగర్ గా ఆమెకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఆడపిల్లనమ్మా అనే సాంగ్ పాడి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్న మధుప్రియ 2011లో దగ్గరగా దూరంగా సినిమాలో "పెద్దపులి" పాట తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆడపిల్లనమ్మా అనే సాంగ్ పాడినప్పుడు మధుప్రియ వయసు కేవలం 10ఏళ్లు మాత్రమే . ఈ పాట ఎంతమంది ఆడపిల్లలకి లేడీస్ కి కనెక్ట్ అయ్యింది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .


ఆ తర్వాత ఒక్కొక్క అవకాశం అందుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంది . ఫిదా , సరిలేరు నీకెవ్వరు , బంగార్రాజు,  టచ్ చేసి చూడు, లైలా , సంక్రాంతికి వస్తున్నాం.. ఇలా ఎన్నెన్నో సినిమాల్లో పాటలు పాడి తనకి మంచి కెరియర్ ని ఏర్పరచుకుంది మధుప్రియ.  కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో  ఆమె పాడిన "గోదారి గట్టు" సాంగ్ ఎంత హైలైట్ గా మారింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియాలో మధుప్రియ పేరు బాగా ట్రెండ్ అవుతుంది . దానికి కారణం ఆమె షేర్ చేసిన పిక్స్ .



మధుప్రియ చెల్లెలి పెళ్లి సందడిలో మునిగి తేలిపోయింది. ఇటీవల చెల్లి నిశ్చితార్ధాని ఘనంగా నిర్వహించిన మధుప్రియ ఇప్పుడు పెళ్లి పనుల్లో కూడా బిజీ అయిపోయింది.  ఆగస్టు ఐదున ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ ఫంక్షన్ లో సందడి చేసింది మధుప్రియ.  దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటూ "మా చెల్లి పెళ్లికూతురు అయ్యింది" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మధుప్రియ ఇంత హ్యాపీగా ఉండటం చూసి ఆమె ఫ్యాన్స్ కూడా ఖుషి అయిపోతున్నారు. మధుప్రియ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా సంపాదించుకుని ఎప్పుడూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: