జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా మరికొద్ది రోజులలో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియా మొత్తం కూడా వార్ 2 హ్యాష్ ట్యాగ్స్  తో ట్రెండ్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో కన్నా కూడా బాలీవుడ్ లో ఈ సినిమాకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం గమనార్హం. హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కీయరా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ బిగ్ ప్రాజెక్ట్ నే ఈ వార్ 2.  ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి అంటూ రిలీజ్ అయిన అప్డేట్స్ ఆధారంగా తెలుస్తుంది .


ఇవన్నీ పక్కన పెడితే సినిమా రిలీజ్ టైం దగ్గర పడిపోతుంది. సినిమాకి ఎంత పబ్లిసిటీ కావాలంటే అంత పబ్లిసిటీ ప్రమోషన్స్ నిర్వహించుకుంటున్నారు సినీ మేకర్స్ . ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా హృతిక్ రోషన్ మధ్య ట్వీట్ వార్ హైలెట్గా మారింది . హాష్ ట్యాగ్  హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయాలి అనే విధంగా హృతిక్ రోషన్ ...లేదు లేదు హాష్ ట్యాగ్ ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ చేయాలని ఎన్టీఆర్ సరదాగా ట్వీట్టర్ వేదికగా మాట్లాడుకున్నారు . దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి .



అయితే ఇప్పుడు సినీ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మరో బిగ్ సాహసం చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో సినీ ప్రమోషన్స్ కోసం తమ ఫ్యామిలీని కూడా రంగంలోకి దించుతున్నారు కొంతమంది స్టార్స్ . అదే లిస్టులో కి యాడ్ అయిపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అన్న వార్త ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్లో వార్ 2కి మంచి ప్రమోషన్స్ ఉన్నాయి . కానీ టాలీవుడ్ కి వచ్చేసరికి పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది.  ఇదే క్రమంలో తన బ్రదర్ కళ్యాణ్ రామ్ తో ఒక ఇంటర్వ్యూని ప్లాన్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ .



అంతే కాదు ఇందులో రాజమౌళి కూడా ఇందులో భాగం కాబోతున్నారట . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు ఏ సినిమా విషయంలోనూ ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేదు జూనియర్ ఎన్టీఆర్.  తన బ్రదర్ కళ్యాణ్ రామ్ ని కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు సినీ ప్రముఖులు..? ఇది సినిమాకి సక్సెస్ ని ఇస్తుందా..? లేదా..? అన్నది అందరికీ బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..!!



మరింత సమాచారం తెలుసుకోండి: