
ఇప్పటికే బయటకు వచ్చిన కంటెంట్ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాడు. ప్రచార కార్యక్రమాల ద్వారా మేకర్స్ కూలీని మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కూలీలో నాగార్జున పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు హీరోగా అలరించిన నాగ్.. ఇప్పుడు రూటు మార్చారు. రజనీ మూవీలో మెయిన్ విలన్ గా సైమన్ పాత్రలో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారు.
అయితే సైమన్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ నాగార్జున కాదట. మొదట డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నటసింహం నందమూరి బాలకృష్ణను ఆ పాత్ర కోసం సంప్రదించారట. కానీ హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య.. ఇతర హీరోల సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్స్ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారట. సైమన్ పాత్రను సున్నితంగా బాలయ్య రిజెక్ట్ చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. డైరెక్టర్ లోకేష్ నాగార్జున వద్దకు వెళ్లడం.. ఆయన కథ విని సర్‌ప్రైజింగ్ గా ఫీల్ అవ్వడం.. క్యారెక్టర్ నచ్చి విలన్‌గా చేయడానికి ఓకే చెప్పడం వరుసగా జరిగిపోయాయి. నాగ్ కూలీపై చాలా ధీమాగా ఉన్నారు. తాను హీరో కాకపోయిన మూవీని రజనీ కంటే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు