దక్షిణాది సూపర్ స్టార్ ధనుష్, ప్ర‌ముఖ‌ నటి మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌చారానికి కార‌ణం ఇటీవ‌ల కాలంలో ధ‌నుష్‌, మృణాల్ ప‌దే ప‌దే జంట‌గా క‌నిపిచండ‌మే. రీసెంట్ గా మృణాల్ బ‌ర్త్‌డే పార్టీలో ధ‌నుష్ సంద‌డి చేయ‌డం, ఆమె యాక్ట్ చేసిన `సన్ ఆఫ్ సర్దార్ 2` మూవీ ప్రీమియర్ కు సైతం ఆయ‌న హాజ‌రు కావ‌డం వంటి ప‌రిణామాలు డేటింగ్ పుకార్ల‌కు బ‌లాన్ని చేకూర్చాయి.


ఇదే త‌రుణంలో ధ‌నుష్‌, మృణాల్ మ‌ధ్య ఏజ్ గ్యాప్‌పై నెట్టింట చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. 1983 జూలై 28న జన్మించిన ధనుష్ ఇటీవలే 42 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. మృణాల్ ఠాకూర్ విష‌యానికి వ‌స్తే.. ఈ బ్యూటీ 1992 ఆగస్టు 1న జ‌న్మించింది. రీసెంట్ గా తన 33వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంది, దీంతో ధ‌నుష్‌, మృణాల్ మ‌ధ్య తొమ్మిదేళ్ల తేడా కనిపించింది.


ఏజ్ గురించి ప‌క్క‌న పెడితే.. డేటింగ్ పుకార్లు తెర‌పైకి వ‌చ్చిన వేళ ఫ్యాన్స్ మృణాల్‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డం షురూ చేశారు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో మృణాల్ రాంగ్ ట్రాక్ లో వెళ్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప‌లువురు హీరోయిన్ల‌తో ధ‌నుష్ గ‌త రిలేష‌న్స్ ను గుర్తు చేస్తూ అత‌నికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని మృణాల్ కు హిత‌వు ప‌లుకున్నారు.


కాగా,  ధనుష్ 2004లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యాను పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర రాజా, లింగా రాజా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2022లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అదీ కాకుండా అమల పాల్‌, శృతి హాస‌న్‌, త్రిష త‌దిత‌రుల‌తో ధ‌నుష్ ల‌వ్ ఎఫైర్స్ న‌డిపిన‌ట్లు కోలీవుడ్ ఫిల్మ్ స‌ర్కిల్స్ లో బ‌ల‌మైన టాక్ ఉంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: