
ఇక వాస్తవ విషయాలకి వస్తే..ఒక రోజుకి కూలిగా వెళ్తున్న కార్మికుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పని చేసి మొత్తాంగా ₹500 సంపాదిస్తాడు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొన్ని యూనియన్ల తీరును చూస్తే, వాళ్ల డిమాండ్లు వినగానే మైండ్ బ్లాక్ అయిపోయేలా ఉంది. సినిమా షూటింగ్‌లకు వస్తున్న కొన్ని యూనియన్ సభ్యులు, ఒక్క రోజు వచ్చినందుకు నాలుగు రోజుల కూలీ తీసుకెళ్తున్న పరిస్ధిరి. ఒక సీనుపై దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడంటే చాలు ఇక టై ఓవర్ ఓవర్ అయింది కదా.. డబుల్ వేతనం ఇవ్వాలి అంటున్నారు.
అదే ఆదివారం అయితే? ఇక ఊహించాల్సిందే – సండే + ఓవర్‌టైం = నాలుగు రెట్లు జీతం లా తయారైంది పరిస్ధితి. ఒక నార్మల్ టెక్నీషియన్ ఒక్క రోజుకు ₹1,000 అయితే..ఇక ఆదివారం అయితే ₹2,000. ఇక అదీ ఓవర్‌టైం అయితే ₹4,000.. ఇదే తీరుతో రోజూ కాస్టింగ్, లైటింగ్, మేకప్ యూనిట్స్ వసూలు చేస్తున్నారు అంటూ మాటలు వినిపిస్తున్నయ్.
ఇది చూసిన నిర్మాతలు గట్టిగా నే నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవైపు నటీ నటుల రెమ్యునరేషన్‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి..మరోవైపు యూనియన్ సభ్యులు ఇలా అడిగినదానికంటే రెట్టింపు డబ్బులు తీసుకుంటున్నారు. ఎటు వచ్చి ఇప్పుడూ బొక్క అంతా చిన్న నిర్మాతలకే. బడ్జెట్ అనుకున్నదానికి డబుల్ ట్రిపుల్ అయిపోతుంది . పూర్వం ఒక సినిమా నలభై రోజుల్లో పూర్తి చేసేవారు. ఇప్పుడు ఏ సినిమా అయినా కనీసం 80–100 రోజులు పడుతోంది. ఎంత కష్టపడ్డా, షూటింగ్ లేట్ అయినా, డబ్బు చెల్లించాల్సిందే. లేకపోతే అంతే సమ్మె అంటారు. ఈ వ్యవహారంతో చిన్న నిర్మాతలు కష్టాల్లో పడిపోతున్నారు. ఒక సినిమా డబ్బింగ్ లేట్ అయినా, ఓ స్టూడియో కాలం 5 నిమిషాలు దాటినా.. అదీ ఓవర్‌టైం రేటుతో లెక్కేస్తారు. ఈ పరిస్థితుల్లో అసలు సినిమా పూర్తి అవుతుందా అనే ప్రశ్న నిలుస్తోంది. అంతేకాదు కొంతమంది ఇండస్ట్రీకి పుట్టిన పిల్లలా చూసుకోవాల్సిన యూనియన్లు ఇలా కఠినంగా మారి నిర్మాతల్ని పీల్చేసే తీరుతో వ్యవస్థే వక్రీకృతమవుతోంది. అంటున్నారు. ఇప్పుడు మారాల్సింది వాడికీ, వీడికీ మాత్రమే కాదు... సిస్టమ్‌కే కొత్త రెగ్యులేషన్ అవసరం అన్న టాక్ వినిపిస్తుంది..!!