తెలుగు, హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి సీనియర్ హీరోయిన్లలో నమ్రత కూడా ఒకరు. ఆమె తెలుగులో చేసింది సినిమాలు తక్కువే అయినప్పటికీ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగింది.అయితే అలాంటి నమ్రత మోడలింగ్ రంగం నుంచి కెరియర్ మొదలుపెట్టి సినిమాల్లోకి వచ్చింది. ఆ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి స్టార్ గా మారి చివరికి మహేష్ బాబుతో తన లైఫ్ సెట్ చేసుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ అసలు హీరోయిన్ అయ్యేది కాదట. నమ్రత డ్రీమ్ వేరే ఉందట. కానీ అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పొజిషన్ కి వెళ్ళింది. అయితే నమ్రత తన సినీ కెరియర్ మొదలు పెట్టింది హిందీ ఇండస్ట్రీలోనే.

 అక్కడ చాలా సినిమాలు చేసి ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన వంశీ చిత్రంలో నటించింది. బి.గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిపోయింది. అయితే నమ్రత అసలు డ్రీమ్ సినిమాల్లోకి రావడం అయితే కాదట. ఆమె ముందుగా ఎయిర్ హోస్టెస్ కావాలనుకుందట. ఆ విధంగానే ముందుకు వెళ్ళింది. కానీ వాళ్ళ అమ్మ అప్పట్లో విమానాలు ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయని ఆ ఉద్యోగం వద్దని బెదిరించిందట.

దీంతో అమ్మ మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేక నమ్రత  ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకునే తన డ్రీమ్ ని వద్దనుకుందట.ఆ తర్వాత మెల్లిగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లో కొన్నాళ్లపాటు సినిమాలు చేసి టాలీవుడ్ లో మహేష్ బాబు తో వంశీ సినిమా చేసి ఆయనతోనే ప్రేమలో పడింది. చివరికి మహేష్ బాబుని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఆయనకే అంకితం చేసి సినిమాలు మానేసింది. ప్రస్తుతం నమ్రతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా హ్యాపీ గా జీవితాన్ని గడుపుతోంది.. అయితే తన డ్రీమ్ ని ఓ ఇంటర్వ్యూలో చెప్పకుంటూ కోట్ల ఆస్తులు ఉంటే ఏం లాభం ఎప్పటికి నా డ్రీమ్ తీరదు అంటూ నమ్రత తన ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: