
బుకింగ్ స్టార్టయిన 37 నిమిషాల్లోనే అన్ని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు సోల్డ్ అవుట్ కావడం అభిమానుల్లో జోష్ పెంచింది. ఫ్యాన్స్ ఫెస్టివల్ మోడ్ .. రజనీకాంత్ కర్ణాటకలో కూడా విపరీతమైన అభిమాన గణం కలిగిన స్టార్. బుకింగ్స్ స్టార్ట్ అవ్వగానే అభిమానులు థియేటర్ల ముందు లైన్లలో నిలబడి, ఆన్‌లైన్ టికెట్ల కోసం వెబ్‌సైట్స్ క్రాష్ అయ్యేలా రష్ చేశారు. బెంగళూరు, మైసూరు, మంగళూరు, హుబ్లీ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం హడావుడి నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలో #CoolieStorm, #Rajinikanth ట్రెండింగ్‌లో టాప్‌లో ఉన్నాయి. కూలీ హైప్ వెనుక కారణం .. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ – రజనీకాంత్ కాంబినేషన్ అనే మాటే ఈ సినిమాపై అంచనాలను ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్లింది. లోకేష్ మాస్టర్ ఆఫ్ మాస్ సీక్వెన్సెస్, రజనీ మాస్ డైలాగులు, స్టైలిష్ యాక్షన్… ఈ కాంబో కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
పైగా ట్రైలర్‌లో రజనీ చూపించిన స్టైల్, పంచ్ డైలాగులు, ఆగ్రహం కలిగిన స్క్రీన్ ప్రెజెన్స్ – ఫ్యాన్స్ కేరింతలు పెట్టేలా చేశాయి. ట్రేడ్ సర్కిల్స్ అంచనాల ప్రకారం ‘కూలీ’ కర్ణాటకలో ఫస్ట్ డే 20 కోట్లకు పైగా కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. ఈ రేంజ్‌లో ఓపెనింగ్ సాధించిన తమిళ సినిమా కర్ణాటకలో ఇదే మొదటిసారి కావొచ్చు. ఓపెనింగ్ బుకింగ్స్ రికార్డ్ చూస్తుంటే రిలీజ్ రోజు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ మాస్ మేనియా తప్పకుండానే కనిపించబోతోంది. మొత్తానికి, ‘కూలీ’ రజనీ మాస్ పవర్‌కి మరో సాక్ష్యంగా నిలుస్తోంది. కర్ణాటకలో మొదటి రోజే బుకింగ్స్ తోనే చరిత్ర రాసిన ఈ సినిమా, విడుదల రోజు మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తే ఆశ్చర్యం లేదు.