
చాలా చోట్ల అభిమానులు బయటికి రావడానికి వెనుకంజ వేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా భారీగానే ఉంది. మూడో వారంలోనూ మహావతార్ నరసింహ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. వీకెండ్ మొత్తానికి టికెట్లు దొరకని స్థాయిలో పుల్ ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు షోలు పెంచుతున్నారు. అదేవిధంగా కింగ్డమ్ రెండో వారంలో బలంగా ఉంది. రాబోయే వార్ 2, కూలీ కోసం మూవీ లవర్స్ డబ్బు సేవ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ అతడు మీద ప్రభావం చూపించాయి. మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్‌గా ఈ రీ-రిలీజ్‌ని మైలురాయి చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఫ్యాన్స్. మహేష్ స్వాగ్, త్రివిక్రమ్ మాస్టర్ మైండ్ డైరెక్షన్, మణిశర్మ మ్యూజిక్, టెక్నికల్ రిచ్‌నెస్ - అన్నీ కలిపి అతడుని మళ్లీ థియేటర్లో చూడటం ఒక ఫెస్టివల్‌గా మారుతుందని అనుకున్నారు.
మురారి రీ-రిలీజ్‌లో రేంజ్ హంగామా చేసిన ఫ్యాన్స్, అతడుకి అంతకు పదింతలు హంగామా ప్లాన్ చేశారు. కానీ, సుదర్శన్ 35 ఎంఎంలోనే రెండు రోజులకు నాలుగు షోలు వేసుకోవడానికే డిస్ట్రిబ్యూటర్లకు కష్టాలు పడ్డాయి. హై డిమాండ్, లిమిటెడ్ స్క్రీన్స్, తోడు వర్షాలు - అన్నీ కలిపి కలెక్షన్లను తగ్గించాయి. అతడుకి చేతిలో ఇప్పుడు అయిదు రోజులు మాత్రమే ఉన్నాయి. అయినా, ఈ అన్ని అడ్డంకుల మధ్య కూడా అతడు బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్లు రాబడితే, అది మహేష్ బాబు స్టార్ పవర్‌కే నిదర్శనం. రీ-రిలీజ్ అయినా, 18 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అయినా, మహేష్ బాబు మ్యాజిక్ ఇంకా క్రేజ్ తగ్గలేదని మరోసారి రుజువవుతోంది.