హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన వార్2 సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడినా సినిమా బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసున్న సంగతి తెలిసిందే. అయితే వార్2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లెక్కల్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ ఈవెంట్ లో అభిమానులు తారక్ మాట్లాడుతున్న సమయంలో గట్టిగా అరవడం జరిగింది.

అయితే  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ సమయంలో వెళ్ళిపోనా అంటూ వార్నింగ్ ఇచ్చారు. మైక్ ఇచ్చి వెళ్లిపోవడానికి  ఎక్కువ సమయం పట్టదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అభిమానులను సైలెంట్ గా ఉండాలని తారక్ రిక్వెస్ట్ చేయగా అభిమానులు సైతం సైలెంట్ కావడం జరిగింది.  ఆదిత్య చోప్రా గారు కోరడం వల్లే తాను  ఈ సినిమాలో నటించడం జరిగిందని తారక్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ఆదిత్య చోప్రా గారి మాట వినకుండా, నమ్మకుండా ఉండి  ఉంటే  ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని తారక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  యశ్  రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ లోకి నన్ను తీసుకున్నందుకు కృతఙ్ఞతలు అని తారక్ పేర్కొన్నారు.  బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తాను  రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ ఈవెంట్ కు రావడం అస్సలు సాధ్యం కాలేదని  జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్  ముఖర్జీ డైరెక్షన్ లో నటించి ఇక్కడికి వచ్చానని తారక్ తెలిపారు.  కహోనా ప్యార్ హై  సినిమాలో  హృతిక్ రోషన్ డాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యానని  మన దేశంలో ఉన్న గొప్ప నటులలో హృతిక్ ఒకరని తారక్ పేర్కొన్నారు.  తారక్ కామెంట్లు అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. వార్2 మూవీ అంచనాలను అందుకుని సంచలనాలను సృష్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది. వార్2 మూవీ బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: