
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 17 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల్లో ఈ సినిమాకు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 57.89 కోట్ల షేర్ ... 86.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 17 రోజుల్లో 69.23 కోట్ల షేర్ ... 114.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 58.27 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. మరి ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకోవడం ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇంపాజిబుల్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుంది అనేది చూడాలి.