టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ ముగ్గురు హీరోయిన్ల పరిస్థితి ప్రస్తుతం దాదాపు సమానంగా కనబడుతుంది. ఆ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీలు మరెవరో కాదు..? కృతి శెట్టి ,  శ్రీ లీల , భాగ్య శ్రీ బోర్స్.

కృతి శెట్టి "ఉప్పెన" అనే మూవీతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో ఈమెకు సూపర్ సాలిడ్ గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమా అవకాశాలు తెలుగులో రావడం మొదలు అయింది. ఈమె కూడా వరుస పెట్టి సినిమాల్లో నటించింది. ఉప్పెన మూవీ తర్వాత ఈమెకు కొన్ని సినిమాల ద్వారా విజయాలు వచ్చిన ఆ తర్వాత ఈమెకు విజయాలు దక్కలేదు. దానితో ఈమె తెలుగులో చాలా వరకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక శ్రీ లీల , శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మామూలు విజయం సాధించిన ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది. ఈ మూవీ తర్వాత ఈమెకు కూడా పలు సినిమాల ద్వారా విజయాలు వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈమెకు విజయాలు లేవు. దానితో ఈమెకు కూడా మరి కొంత కాలం ఇలాగే అపజయాలు వచ్చినట్లయితే ఈమెకు కూడా తెలుగులో అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో భాగ్య శ్రీ బోర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ఆయన ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగులో అవకాశాలు వచ్చాయి. తాజాగా ఈమె నటించిన కింగ్డమ్ సినిమా విడుదల అయింది. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర విజయం సాధించే అవకాశాలు ప్రస్తుతం కనబడడం లేదు. మరి ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న రాబోయే సినిమాలైనా మంచి విజయం సాధిస్తే ఈమె మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఓ ఊపు ఊపుతున్న ఈ ముగ్గురు బ్యూటీలు కూడా మొదటి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత వరస పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: