ఈమూవీ 1000 కోట్ల సినిమాగా మారుతుంది అన్న అంచనాలు చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఓవర్ సీస్ లో ఈమూవీ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఆగష్టు 14 తెల్లవారే లోపు వచ్చే ప్రీమియర్ షోల రిపోర్ట్స్ రివ్యూల గురించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న లీకుల ప్రకారం ‘కూలీ’ మ్యానియా ముందు ‘వార్ 2’ వెనకపడినట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీలో వచ్చే మూడు కీలక ఘట్టాలు ఈమూవీని 1000 కోట్ల సినిమాగా మార్చడంలో ఎటువంటి సందేహం లేదు అని అంటున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ గెటప్ ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా  దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన ప్రయోగంతో ధియేటర్లు అధిరిపోవడం ఖాయం అని అంటున్నారు.

మరీ ముఖ్యంగా ఈసినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో 1980 కాలం నాటి రజినిని గుర్తు చేస్తూ పెట్టిన హార్బర్ ఎపిసోడ్ లో రజనీకాంత్ గెటప్ చూసి అందరూ షాక్ అవుతారని అంటున్నారు. ఇక ఈసినిమా క్లైమాక్స్ ముందు నాగార్జున పాత్ర ముగిశాక ఎంట్రీ ఇచ్చే అమీర్ ఖాన్ తో రజని తలపడే ఫేస్ అఫ్ ఈమూవీకి మరింత క్రేజ్ ను తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఈమూడు అంశాలు సగటు ప్రేక్షకుడుకి బాగా కనెక్ట్ అయితే ఈమూవీ 1000 కోట్ల సినిమాగా మారిపోవడం ఖాయం అని అంటున్నారు. ఈమూవీ ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’  ‘పుష్ప’  ‘కె జి ఎఫ్’ రేంజ్ లో ఒక ట్రెండ్ సెటర్ గా మారడం ఖాయం అన్న అభిప్రాయం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులలో ఉంది.  

వాస్తవానికి ఈమూవీ పై క్రేజ్ ఈ రేంజ్ లో ఏర్పడుతుందని ముందుగా ఇండస్ట్రీ వర్గాలు ఊహించలేదు. అయితే క్రేజ్ ఇప్పుడు ఆకాశానికి తాకడంతో ఆ అంచనాలను అందుకోవడంలో ఈమూవీ లోని కథ లేకపోతే ఒక్కరోజులో ఫలితం తారుమారు అయ్యే ఆస్కారం ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: