శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలకు ఇక పండగే.. శ్రావణమాసంలో ఎన్నో పండుగలు వస్తాయి.అలా రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం ఇలా పండగలన్నీ ఈ మాసంలో పలకరిస్తాయి.అయితే శ్రావణమాసంలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం ఫేమస్.. ఈ వరలక్ష్మి వ్రతం రోజు చాలామంది ఆడవాళ్లు ఆ లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారికి వాయినం ఇచ్చి తమ స్తోమతకు తగ్గట్టు ఐదుగురికి,11 మందికి,21 మందికి వాయినాలు ఇస్తూ ఉంటారు. అయితే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు ఇద్దరు ఆడవాళ్లు చేసుకోవచ్చు.అయితే పెళ్లి కాని వాళ్లేమో మంచి భర్త రావాలని పెళ్లయిన వాళ్లేమో తమ సౌభాగ్యం బాగుండాలని లక్ష్మీ అమ్మవారిని వేడుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది జంటలు పెళ్లికాకముందే దంపతులు చేసే పూజలన్నీ చేస్తున్నారు.

అలా రీసెంట్ గా వరలక్ష్మీ వ్రతం చేసిన సమయంలో యాంకర్ బిగ్ బాస్ బ్యూటీ అయినటువంటి సిరి హనుమంతు శ్రీహాన్ అలాగే ప్రియాంక జైన్, శివకుమార్ లు వరలక్ష్మీ వ్రతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై చాలామంది జ్యోతిష్యులు మండిపడుతున్నారు. ముఖ్యంగా సిరి హనుమంతు శ్రీహాన్ ని టార్గెట్ చేస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు మురళీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పెళ్లి కాకపోతే ఒంటరిగా చేసుకోవాలి.పెళ్లయితే భర్తతో చేసుకోవాలి.కానీ ఇలా లివింగ్ రిలేషన్ లో ఉంటూ పెళ్లైన వాళ్ళ లాగా ఈ వరలక్ష్మీ వ్రతం చేయడం ఏంటి అంటూ మురళి శర్మ మండిపడ్డారు. అంతేకాదు వరలక్ష్మి వ్రతం లేదా మరేదైనా పూజలు చేసుకుంటే పెళ్లి కాని వాళ్ళు ఏమో తమ తండ్రి గోత్రం ని చెప్పుకుంటారు.

పెళ్లయిన వాళ్లేమో తమ భర్త గోత్రంని చెప్పుకుంటారు.కానీ ఇలా ఎటు కాకుండా ఉన్నవాళ్లు ఎవరి గోత్రనామాలతో పూజలు చేశారు.. ఇప్పుడు సిరి హనుమంతు శ్రీహాన్ చేసిన పూజలో సిరి హనుమంతు ఎవరి గోత్రం వాడుకుంది. అసలు ఇలా పెళ్లి కాకుండానే పెళ్లయిన దంపతుల్లాగా ఈ పూజలు చేయడం ఏంటి అంటూ జ్యోతిష్యుడు మురళీ శర్మ మండిపడ్డారు. అంతేకాదు బిగ్ బాస్ లోని వింత పోకడలను బయట కూడా ఆచరిస్తున్నారని, సనాతన ధర్మం ప్రకారం వరలక్ష్మీ వ్రతం పెళ్ళికాని ఒక ఆడ మగ కలిసి చేయడం పద్ధతి కాదు అని, ఇలా లివింగ్ రిలేషన్ లో ఉంటూ పూజలు చేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ సిరి హనుమంతు శ్రీహాన్ లపై మండిపడ్డారు జ్యోతిష్యుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: