
దీనికి కాంపిటీషన్‌గా బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఇద్దరు బడా స్టార్ హీరోలు కలసి నటించిన మల్టీస్టారర్ మూవీ "వార్ 2" కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని మేకర్స్ హైప్ క్రియేట్ చేశారు. “ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుంది” అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వార్ 2 హిట్ అవుతుందా? కూలీ హిట్ అవుతుందా? అంటూ రకరకాల పోల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఒక వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో యాంకర్‌గా ఉన్న ఓ ఆవిడ, హాస్పిటల్ బెడ్‌పై పడుకున్న చిన్న బాబును “కూలీ సినిమా చూస్తావా? లేక వార్ 2 సినిమా చూస్తావా?” అని అడుగుతుంది. వెంటనే ఆ బాబు లేచి “నేను ఖడ్గం సినిమా చూస్తాను టీవీలో” అని చెబుతాడు.
ప్రతి ఏడాది ఆగస్టు 15న టీవీలో ఖడ్గం సినిమా ప్రసారమవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంతోనే, రెండు బిగ్ బడా సినిమాలు రిలీజ్ అయినా సరే, అందరూ ఖడ్గం సినిమాకే ఓటు వేస్తారని సెటైరికల్‌గా ఈ వీడియోని క్రియేట్ చేశారని నెటిజన్లు చెబుతున్నారు. “ఈ వీడియో చాలా సరదాగా, ఫన్నీగా ఉంది” అంటూ మాట్లాడుకుంటున్నారు.