మరికొద్ది గంటల్లో వార్ 2 రిలీజ్ అవబోతున్న మూమెంట్ లో సెన్సేషనల్ మ్యాటర్ లీక్ అయింది. సోషల్ మీడియాలో ఇదే బాగా ట్రెండ్ అవుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో, జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో, హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ లేటెస్ట్ బిగ్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్  వార్ 2. ప్రమోషన్స్ కోసం హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ మరికొద్ది గంటల్లో రాబోతోందనే వార్త బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.


ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా పై నెగిటివ్ టాక్ ఎంత వేగంగా ట్రెండ్ అవుతుందో మనమందరం చూశాం. ఆ నెగిటివిటీని పాజిటివ్ హైప్‌గా మార్చడానికే అయాన్ ముఖర్జీ ఓ ప్రత్యేక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అసలు ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ థియేటర్లలోనే రివీల్ చేయాలని టీమ్ అనుకున్నా, కొద్దిగా నెగటివ్ టాక్ రావడంతో ముందుగానే బయట పెట్టితే సినిమాకి మరింత భారీ హైప్ వస్తుందన్న అంచనాతో ముందుకువచ్చారు. ఇప్పటివరకు వార్ 2లో ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమాలో కనిపించే తెలుగు హీరో అని అంతా అనుకున్నారు. కానీ, వాస్తవానికి ఈ మూవీలో మరో తెలుగు హీరో కూడా స్పెషల్ గెస్ట్ కెయియో రోల్ లో నటించారు అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది.



మేకర్స్ అసలైన ప్లాన్ థియేటర్లో సర్ప్రైజ్ ఇవ్వడమే అయినా, నెగిటివ్ టాక్ కారణంగా ముందుగానే రివీల్ చేస్తే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు. మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. చూడాలి మరి.. అయాన్ ముఖర్జీ వేసిన ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో..? అయితే, ఒక సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో నటించినందుకు తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్‌ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వార్ 2 లో మరోక తెలుగు హీరో ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్.. ఇది ఎంత వరకు మెప్పించే క్యారెక్టర్ అయ్యిఉండచ్చో. ఇది కూడా డమ్మి పాత్ర అయితే  తెలుగు సినీ ఇండస్ట్రీ తారక్ ని..ఆ గెస్ట్ పాత్ర చేసే హీరోని ఇక  మునుపటి  స్థాయిలో ఆదరిస్తుందా ..?? అన్నది హాట్ డిబేట్‌గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: