నేడు బాక్స్ ఆఫీస్ వద్ద రెండు బిగ్ బడా సినిమాలు పోటీలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన కూలీ, అలాగే బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందించిన  సినిమా వార్ 2 రెండూ పాజిటివ్, నెగటివ్ టాక్‌ను సంపాదించుకున్నాయి. కొన్ని ప్లస్ పాయింట్లు, కొన్ని మైనస్ పాయింట్లతో సోషల్ మీడియాలో ఈ సినిమాలకు సంబంధించిన రివ్యూలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కూలీ ముందంజలో ఉన్నప్పటికీ, వార్ 2 కూడా వేగం పెంచుకోవడం తెలుగు రాష్ట్రాల్లో మంచి పరిణామంగా మారింది.
 

సినిమా టాక్ పాజిటివ్, నెగిటివ్ పక్కన పెడితే, రెండు సినిమాల కాలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద మామూలుగా ఉండవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా మూడు రోజుల సెలవులు, పైగా తమిళనాడులో రజనీకాంత్ ఫ్యాన్స్, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ ఫ్యాన్స్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్స్‌లో హంగామా చేయడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అదే తరహాలో తెలుగులో కూడా స్పందన ఉంటే, కలెక్షన్స్ సునామీ మామూలుగా ఉండదని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఒక పక్క వర్షాలు భారీగా పడుతున్నా, రజనీకాంత్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు థియేటర్లలో చూసేందుకు పెద్ద సాహసాలకే దిగుతున్నారు. గురువారం మొదలుకొని ఆదివారం వరకు మొత్తం నాలుగు రోజుల వీకెండ్ రావడం కూలీకి వార్ 2 కి పెద్ద వరంగా భావిస్తున్నారు.



మూవీ మేకర్స్ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచకుండా గరిష్ట రేట్లకే కట్టుబడి ఉండటం అక్కడ కొంచెం నెగిటివ్ పాయింట్‌గా మారింది. అయితే ఏపీలో టికెట్ రేట్లు పెంచడం వల్ల ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపించవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్ 2 వర్సెస్ కూలీ మూవీ రివ్యూలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో బాక్స్ ఆఫీస్ రారాజుగా నిలిచేది ఏది అనేది ఆసక్తికరంగా మారింది. టాక్ ప్రకారం చూసుకుంటే, రెండూ పాజిటివ్ టాక్‌తోనే ముందుకు వెళ్తున్నాయి. కలెక్షన్స్ పరంగా నిర్ణయించాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు కలెక్షన్స్ ఆధారంగా ఈసారి బాక్స్ ఆఫీస్ రారాజు ఎవరో తేలిపోతుంది. దానికి కరెక్ట్ ఆన్సర్ రావాలంటే ఇంకొన్ని రెండు మూడు రోజులు ఆగాల్సిందే.



ఇంతలో కొంతమంది ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోను బాక్స్ ఆఫీస్ రారాజుగా పిలుచుకుంటున్నారు. అయితే ఒరిజినల్ టాక్ ప్రకారం కూలీకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందో, వార్ 2కి కూడా అంతే టాక్ వస్తోంది. రెండు సినిమాల్లో కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉన్నా, ఆ విషయాలను ఫ్యాన్స్ బయటపెట్టడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: