తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ ఈమేజ్ కలిగిన హీరోయిన్లలో సమంత ఒకరు. ఈమె కేవలం తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించి ఇప్పటికి కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సమంత ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించడం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఈ బ్యూటీ నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టింది.

అందులో భాగంగా తాజాగా శుభం అనే ఒక సినిమాను నిర్మించింది. కానీ ఈ మూవీ సమంత కు నిరాశనే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా సుమంత ఓ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు , ఇప్పటికే అందుకు సమంత గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కార్తీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మరికొంత కాలంలోనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 అనే సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ప్రేక్షకుల్లో నిలకొని ఉన్నాయి. ఈ సినిమాలో సమంత ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా సమంత రెండు భారీ క్రేజ్ కలిగిన సినిమాలలో నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: