హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఆలియా భట్ ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈమె నటిగా కెరీర్ ను మొదలు పెట్టిన ప్రారంభంలోనే మంచి విజయాలను అందుకుంది. అలాగే ఈమె నటించిన చాలా సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వచ్చింది. దానితో ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో హీరోయిన్గా కెరియర్ను ప్రారంభించిన కొత్త లోనే మంచి క్రేజ్ దక్కింది. అలాగే ఈమె చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం రామ్ చరణ్ , తారక్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా నటించింది.  ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. అలాగే ఈ సినిమాలో ఆలియా భట్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఆలియా భట్ కి  తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం ఈమె వరుస పెట్టి పెట్టి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న  హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అడల్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు తెలుస్తుంది. కానీ ఆమె అడల్ట్ సినిమాలో నటించడం లేదు. ఆమె ఒక అడల్ట్ కంటెంట్ తో రూపొందే సినిమాను నిర్మించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఆలియా భట్  మరికొన్ని రోజుల్లోనే ఓ సినిమాను తన బ్యానర్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు , అది కాస్త అడల్ట్ కంటెంట్తో ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: